రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం, ఉద్రిక్తత: ఖైరతాబాద్‌లో బైక్ కు నిప్పు, బస్సు అద్దాలు ధ్వంసం

By narsimha lode  |  First Published Jun 16, 2022, 11:38 AM IST


రాజ్ భవన్  ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను హైద్రాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.నిన్న ఢిల్లీలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దారుణంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 


హైదరాబాద్:  హైద్రాబాద్ లోని  RajBhavan ముట్టడికి ప్రయత్నించిన Congress కార్యకర్తలను గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. విడతల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్డడికి వచ్చారు. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఖైరతాబాద్ సెంటర్లో  బైక్ కు నిప్పు , ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం

Latest Videos

undefined

ఖైరతాబాద్ సెంటర్లో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ కు నిప్పు పెట్టి నిరసనకు దిగారు. మరో వైపు బస్సును రోడ్డుపై నిలిపివేసి బస్సుపైకి ఎక్కి ఆందోళన నిర్వహించారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఖైరతాబాద్ సెంటర్లో  రోడ్డుపైనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ రోడ్డుపైనే నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.  కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ వైపు వెళ్లకుండా ఖైరతాబాద్ సెంటర్ నుండి రాజ్ భవన్ సెంటర్ వైపునకు వెళ్లకుండా  పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

సోలీసుల అత్యుత్సాహం వల్లే ఖైరతాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకొందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. శాంతి యుతంగా తాము ఈడీ కార్యాలయం ముందు రెండు రోజులు ఆందోళనలు చేసిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. రాజ్ భవన్  వద్ద నిరసన చేసి గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవడమే   బైక్ దగ్దం, బస్సు అద్దాలు ధ్వంసానికి కారణమైందని జగ్గారెడ్డి ఆరోపించారు. 

ఖైరతాబాద్ నుండి రాజ్ భవన్ వరకు చేరుకున్న జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులతో భట్టి విక్రమార్క వాగ్వావాదానికి దిగారు డీసీపీ జోయల్ డేవిస్ తో భట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో డీసీపీ జోయల్ డేవిస్ ను వెనక్కి నెట్టివేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఛలో రాజ్ భవన్ కార్యక్రమంతో అమీర్ పేట, పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్ లలో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకొంది. రోడ్లపైనే వందలాది వాహనాలు నిలిచిపోయాయి.  

రేణుకా చౌదరి హల్ చల్

పోలీసుల వలయాన్ని చేధించుకొంటూ రేణుకా చౌదరి రాజ్ భవన్ వైపు వెళ్తున్న సమయంలో పోలీసులు ఆమెను అనుసరించారు.  తనను టచ్ చేయవద్దని రేణుకా చౌదరి గట్టిగా అరిచారు. మహిళ పోలీసులతో కూడా రేణుకా చౌదరి వాగ్వావాదానికి దిగింది. తోపులాట చోటు చేసుకొంది. ఒక సమయంలో  పురుష పోలీస్  చొక్కా పట్టుకొంది రేణుకా చౌదరి.అంతకుముందు తనను అరెస్ట్ చేసేందుకు యత్నించిన మహిళా పోలీసులను నెట్టివేశారు రేణుకా చౌదరి.పంజాగుట్ట ఎస్ఐ చొక్కాను పట్టుకొని రేణుకా చౌదరి నిలదీశారు.

ఈ సమయంలో మహిళా పోలీసులు ఆమె చుట్టూ చేరి పోలీస్ వాహనం ఎక్కించారు. వాహనం వద్ద కూడా రేణుకా చౌదరి  మహిళా పోలీసులతో రేణుకా చౌదరి వాగ్వాదానికి దిగారు. పోలీస్ వాహనం నుండి మీడియతో మాట్లాడుతానని రేణుకా చౌదరి దిగారు. ఈ సమయంలో  మహిళా పోలీసులు మరోసారి ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.ఆ తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఇదిలా ఉంటే రాజ్ భవన్ వైపు దూసుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. 
 

రోడ్డుపై బైఠాయించిన రేవంత్ రెడ్డి

రాజ్ భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. రాజ్ భవన్ రోడ్డులోనే రేవంత్ రెడ్డి పారటీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి సహా రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కాార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేవారు. రేవంత్ రెడ్డిని తరలిస్తున్న పోలీస్ వాహనం వెళ్లకుండా ఆ పార్టీ కాార్యకర్తలు అడ్డుకొన్నారు. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది., 

New Delhi పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై  చేసిన దాడులను నిరసిస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.  Rahul Gandhi ని Enforcement Directorate అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ నెల 15న ఢిల్లీ పోలీసులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వ్యవహరించారని ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా చెప్పారు. ఈ మేరకు  మీడియా సమావేశంలో ఢిల్లీ పోలీసులు ఎలా వ్యవహరించారో వీడియోను కూడా ప్రదర్శించారు.

also read:ఢిల్లీలో కార్యకర్తలపై పోలీసుల దాడులు: రేపు రాజ్‌భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
నేషనల్ హెరాల్డ్ కేసులో మూడు రోజుల పాటు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు.  అయితే రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న కూడా 144 సెక్షన్ విధించిన ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెేస్ట్ చేశామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. 144 సెక్షన్ గురించి కాంగ్రెస్ నేతలకు ముందే సమాచారం ఇచ్చామని పోలీసులు వివరించారు. మరో వైపు నిరసనలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కూడా ఢిల్లీ పోలీసులు గుర్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసులు తమ పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వారిపై దాడి చేసి అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.

click me!