హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో అధిక వడ్డీకి రుణాలిచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ వడ్డీలు చెల్లించకుంటే వేధింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించారు.
హైదరాబాద్: Hyderabad నగరంలోని Vanasthalipuramలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదుపై Police ఆరా తీస్తున్నారు.వనస్థలిపురంలో విద్యార్ధులు, మైనర్లను లక్ష్యంగా చేసుకొని అధిక వడ్డీకి అప్పులిస్తున్నారు.అప్పులిచ్చే వారిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కూడా ఉన్నాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
ఈ కథనం మేరకు రూ. 50 వేలు అప్పులిచ్చిన గ్యాంగ్ మూడు మాసాల్లోనే లక్ష రూపాయాలు వసూలు చేశారని ఆరోపించారు. మరో వైపు మరొకరికి 4 లక్షలు అప్పులిచ్చి అదనంగా మరో లక్ష రూపాయాలను వసూలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇదే తరహాలో అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి వేధింపులకు గురి చేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.
హైద్రాబాద్ వనస్థలిపురంలో అధిక వడ్డీ పేరుతో రూ. 4 కోట్లు మోసం చేసి మహిళపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఈ ఏడాది మే 30న చోటు చేసుకొంది.
హైద్రాబాద్ వనస్థలిపురంలో స్వర్ణలత అనే మహిళపై బాధితులు పిర్యాదు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి రూ. 4 కోట్ల మోసం చేసిందని బాధితులు వనస్థలిపురం పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుల పిర్యాదు మేరకు స్వర్ణలత సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2021 ఏప్రిల్ 23న అధిక వడ్డీల పేరుతో వంచన చేసిన ఘటనలో ఏజెంట్ బట్టా మహేంద్ర చౌదరిని అరెస్టు చేశారు. నిందితుడి నుండీ కారు, ల్యాప్ టాప్ , సి.పి.యు. కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.