ఈ నెల 18న చేవేళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ, హాజరుకానున్న ఖర్గే.. అదే వేదికపై పార్టీలోకి చంద్రశేఖర్

Siva Kodati |  
Published : Aug 13, 2023, 06:35 PM IST
ఈ నెల 18న చేవేళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ, హాజరుకానున్న ఖర్గే.. అదే వేదికపై పార్టీలోకి చంద్రశేఖర్

సారాంశం

ఈ నెల 18న చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభకు ప్లాన్ చేసింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. చేవేళ్ల సభలోనే మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం.

ఈ నెల 18న చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభకు ప్లాన్ చేసింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ వేదిక నుంచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేయాలని కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. మరోవైపు చేవేళ్ల సభలోనే మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం. ఆయన చేరికకు టీపీసీసీ నుంచి ఆమోదం లభించింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. చేవేళ్ల లేదా జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ పోటీ చేస్తారంటూ ప్రచారం జోరందుకుంది. 

అంతకుముందు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ పునరేకీకరణలో భాగంగా కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధమని, వారిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోడీ వుండాలన్నదే వాళ్ల లక్ష్యమని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. దళితులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కొంటోందని ఆయన ఆరోపించారు. 

Also Read: బీఆర్ఎస్, బీజేపీలది ఫెవికాల్ బంధం.. అది చంద్రశేఖర్‌కు అర్ధమైంది , అందుకే రాజీనామా : రేవంత్

కోకాపేట లాంటి ప్రాంతంలో ఇలాంటి భూములను ఎకరం 100 కోట్ల చొప్పున అమ్ముకుంటున్నారని రేవంత్ దుయ్యబట్టారు. అసైన్డ్ భూములను లాక్కొని గిరిజనులు, దళితులను కేసీఆర్ ప్రభుత్వం ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తోందని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసైన్డ్ భూములకు భూ యాజమాన్యపు హక్కులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని తెలుసుకున్నాక చంద్రశేఖర్ అక్కడ వుండలేకపోయారని ఆయన పేర్కొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?