రేపు కాంగ్రెస్ ఎన్నికల ఎన్నికల కమిటీ సమావేశం: తెలంగాణలో సెకండ్ లిస్ట్‌కు ఆమోదం

By narsimha lode  |  First Published Oct 24, 2023, 5:39 PM IST

రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.  ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.



హైదరాబాద్: రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సీపీఐ, సీపీఎంలకు  రెండేసి అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సీపీఐ , కాంగ్రెస్ మధ్య  సీట్ల సర్ధుబాటు విషయంలో  తీవ్రమైన ఇబ్బందులు లేవని కాంగ్రెస్ నాయకత్వం చెబుతుంది.  సీపీఎం , కాంగ్రెస్ మధ్య సీట్ల సర్ధుబాటు విషయంలో  ఇంకా స్పష్టత రాలేదు. మిర్యాలగూడ అసెంబ్లీ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పేచీ లేదు.

  అయితే  పాలేరు అసెంబ్లీ సీటుపై సీపీఎం పట్టుబడుతుంది.  పాలేరు కాకుండా వైరా అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉంది.  కానీ, వైరా తీసుకొనేందుకు సీపీఎం మాత్రం సానుకూలంగా లేదు.  సీపీఎంకు గట్టి పట్టున్న భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే  పోడెం వీరయ్యను  కాంగ్రెస్ బరిలోకి దింపింది. సీట్ల సర్ధుబాటు కుదరకపోతే ఒంటరిగా  పోటీ చేస్తామని సీపీఎం తేల్చి చెప్పింది. పాలేరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపనుంది కాంగ్రెస్ పార్టీ.

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రెండో జాబితాకు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం ఆమోదం తెలపనుంది. ఈ నెల  15న కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది.  55 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది.  ఇంకా  64 మందితో  రెండో జాబితాను ప్రకటించాల్సి ఉంది. అయితే  లెఫ్ట్ పార్టీలకు  నాలుగు సీట్లను మినహాయిస్తే 60 సీట్లలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉంది.

also read:ఈ నెల 28 నుండి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర: బీసీ డిక్లరేషన్, మేనిఫెస్టో విడుదలకు చాన్స్

ఈ నెల  21, 22 తేదీల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్  కమిటీ  సమావేశం జరిగింది.ఈ నెల  22న  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం లెఫ్ట్ పార్టీలకు కేటాయించాల్సిన సీట్లపై చర్చించారు.ఈ నెల  21న  నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలోనే అభ్యర్థుల జాబితాకు  కొనసాగింపుగా  రేపు మరోసారి  సమావేశం జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

click me!