కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు గురువారం నాడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు సీసీఎస్ పోలీసులు ఇచ్చిన 41 ఏ సీఆర్ పీసీ నోటీసుపై స్టే ఇవ్వాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన 41 ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్ కనుగోలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27వ తేదీన సునీల్ కనుగోలుకు మరోసారి హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి అందుకున్నారు. ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇవాళ తెలంగాణ హైకోర్టులో సునీల్ కనగోలు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 27వ తేదీన సునీల్ కనుగోలుకు మరోసారి హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి అందుకున్నారు. ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇవాళ తెలంగాణ హైకోర్టులో సునీల్ కనగోలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన రాత్రి హైద్రాబాద్ మాదాపూర్ లో కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. మహిళలపై అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఈ దాడులు నిర్వహించినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ సమయంలో ఈ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెట్టారు.ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.
undefined
also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలుకు సీసీఎస్ పోలీసుల నోటీస్:తీసుకున్న మల్లు రవి
గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా, మహిళలపై అనుచిత పోస్టులు పెడుతున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఐపీ అడ్రస్ ఆదారంగా దాడులు నిర్వహించినట్టుగా పోలీసులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు మాదాపూర్ లో ఈ కార్యాలయం నిర్వహిస్తున్నారు.
గత కొంతకాలంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన సోషల్ మీడియాను కూడా సునీల్ కనుగోల్ టీమ్ ఆపరేట్ చేస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై సోషల్ మీడియా వేదికగా ఈ కార్యాలయం నుండి పోస్టులు పెడుతున్నారని సీసీఎస్ పోలీసులు గుర్తించారు.
ఈ విషయమై సునీల్ కనుగోలుతోపాటు ఆయన బృందానికి సీసీఎస్ పోలీసులు ఇప్పటికే నోటీసులుజారీ చేశారు.అయితే తనకు 10 రోజుల సమయం కావాలని సునీల్ కనుగోలు సీసీఎస్ పోలీసులను కోరారు. ఈ నెల 26వ తేదీన సునీల్ కనుగోలు సహా ఆయన టీమ్ విచారణకు రావాల్సి ఉంది. కానీ విచారణకు రాలేదు. దీంతో ఈ నెల 27న మరోసారి సీసీఎస్ పోలీసులు సునీల్ కనుగోలుకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్ కనుగోలు ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.