ఓయూ భూముల పరిశీలనకు కాంగ్రెస్ బృందం: పట్టు తప్పి కింద పడ్డ వీహెచ్

By narsimha lodeFirst Published May 24, 2020, 2:26 PM IST
Highlights

 ఓయూ భూముల పరిశీలనకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కిందపడిపోయాడు. పోలీసులు ఆయనను లేపారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. 


హైదరాబాద్: ఓయూ భూముల పరిశీలనకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కిందపడిపోయాడు. పోలీసులు ఆయనను లేపారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. 

హైద్రాబాద్ పట్టణంలోని డీడీ కాలనీలో  కబ్జాకు గురైన ఓయూ భూముల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ వెళ్లే సమయంలో అదుపు తప్పి కిందపడిపోయాడు. పోలీసులు అతడిని లేపారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఆందోళనలను కొనసాగించారు.

డీడీ కాలనీలో  కబ్జాకు గురైన ఓయూ భూములను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నేతలు వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి తదితరులు ఆదివారం నాడు పరిశీలించారు.

also read:ఓయూలో కాంగ్రెస్ నేతల టూర్, ఉద్రిక్తత: విద్యార్థుల ఆందోళన

కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లే సమయంలో పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులతో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు వాగ్వాదానికి దిగారు. పోలీసులను తోసుకొంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు కాంగ్రెస్ నేతలను నిలువరించారు. ముందుకు వెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అదుపుతప్పి కింద పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి వి.హనుమంతరావును పైకి లేపాడు.

ఓయూలో కబ్జాకు గురైన భూముల విషయమై తక్షణమే విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఓయూ యూనివర్శిటీ తెలంగాణ ప్రజల గుండెకాయ అని వీహెచ్ అన్నారు. నిజాం స్థాపించిన యూనివర్శిటీ  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలోని యూనివర్శిటీల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. భూ కబ్జాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

click me!