ఓయూలో కాంగ్రెస్ నేతల టూర్, ఉద్రిక్తత: విద్యార్థుల ఆందోళన

By narsimha lodeFirst Published May 24, 2020, 12:35 PM IST
Highlights

 ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఓయూ భూముల పరిశీలనకు కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.


హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఓయూ భూముల పరిశీలనకు కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావులు ఆదివారం నాడు మధ్యాహ్నం ఓయూలో భూముల పరిశీలనకు వచ్చారు.

also read:మహిళలతో దురుసు ప్రవర్తన: ఎమ్మెల్యేలు మంచిరెడ్డి, బలాలపై కేసులు

ఓయూకు చెందిన భూములు కబ్జాకు గురౌతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు మద్దతుగా ోయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 

కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఓ వైపు విద్యార్థుల ఆందోళన మరో వైపు కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదంతో ఓయూలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

ఉస్మానియా యూనివర్శిటికి చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు చేస్తున్నారని ఓయూకు చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. 

భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించిన వారికి ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని కాంగ్రెస్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు చేసిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పై కేసు నమోదు చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. డీడీ కాలనీలో కబ్జాకు గురైన భూమిని కాంగ్రెస్ నేతలు  పరిశీలించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

click me!