కేసీఆర్ ఎటో వెళ్లిపోయారు.. రాష్ట్రపతి పాలన పెట్టండి: కేంద్రానికి పొన్నాల డిమాండ్

By Siva KodatiFirst Published Jul 8, 2020, 4:07 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు.

ప్రజల అవసరాలను సీఎం  పట్టించుకోవడం లేదని.. గత 14 రోజులుగా కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదని పొన్నాల దుయ్యబట్టారు. చివరికి కరోనా కట్టడికి సమీక్ష కోసం గవర్నర్ తమిళిసై... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని పిలిస్తే వెళ్లడం లేదన్నారు.

Also Read:కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

కరోనాతో జనం అల్లాడుతుంటే ఇవేవీ పట్టని కేసీఆర్.. ఎక్కడికో వెళ్లిపోయారని పొన్నాల మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పూర్తిగా విఫలమయ్యారని.. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సచివాలయం కూల్చడం వంటి పిచ్చి తుగ్లక్ పాలన ఎక్కడా ఉండదని లక్ష్మయ్య ఫైరయ్యారు.

Also Read:25 మందికి కరోనా: జూలై 9 నుండి తెలంగాణ హైకోర్టు మూసివేత

కరోనాతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను బందోబస్తుగా ఉంచి రోడ్లను దిగ్బంధనం చేసి కూల్చడం ఏంటని పొన్నాల ప్రశ్నించారు. ఈ పరిస్థితులను చూస్తుంటే... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంలా ఉందని లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని ఆయన కోరారు. కరోనాపై కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలే చెబున్నారని పొన్నాల గుర్తుచేశారు. తెలంగాణలో కరోనా పరీక్షలు, రోగులకు చికిత్స సరిగ్గా చేయడం లేదన్నారు. 

click me!