
పోలీస్ రిక్రూట్‌మెంట్ నిబంధనలు కఠినంగా వున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్‌లో కొత్త నిబంధనలు పెట్టారన్నారు. అభ్యర్ధులకు కొన్ని సడలింపులు ఇవ్వాలని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సహనం వుండాలని జానారెడ్డి సూచించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను విడుదల చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి శాంతి భద్రతలను కాపాడటం ఎంత ముఖ్యమో , నిరుద్యోగుల సమస్యలు వినడం కూడా అంతే ముఖ్యమని జానారెడ్డి అన్నారు.
ALso REad: ప్రగతి భవన్‌కు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..
ఇకపోతే.. హైదరాబాద్‌లో శనివారం యూత్ కాంగ్రెస్ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ లో జరిగిన అవకతవకలను సవరించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటారు. ప్రగతి భవన్ వద్దకు చేరుకుంటున్న యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ లో జరిగిన తప్పులను సవరించాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 7 మల్టిపుల్ ప్రశ్నలకు సంబంధించి హైకోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్, ఫిజికల్ ఈవెంట్స్ పాత పద్ధతి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.