అయ్యప్పస్వామిపై వ్యాఖ్యలు... బైరి నరేష్‌కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలింపు

By Siva KodatiFirst Published Dec 31, 2022, 3:45 PM IST
Highlights

అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బైరి నరేష్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అతనితో పాటు హనుమంత్‌కు కూడా రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. 

అయ్యప్పస్వామిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆనంతరం ఆయనను కోర్ట్‌లో హాజరుపరచగా.. నరేష్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించింది.అతనితో పాటు హనుమంత్‌కు కూడా రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అటు హన్మకొండకు చెందిన బైరి నరేష్ బంధువు వివాదాస్పద పోస్ట్ చేశాడు. నరేష్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ అగ్నితేజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్నితేజ్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. 

కాగా.. బైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోలీసులు నరేష్‌ను ట్రేస్ చేశారు. వరంగల్ నుంచి కరీంనగర్ రూట్ వైపు వెళ్తుండగా వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నరేష్‌ను ప్రస్తతుం కొడంగల్ తరలిస్తున్నట్టుగా సమాచారం. అయితే నరేష్‌పై కొండగల్‌తో పాటు పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, పలువురు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: బైరి నరేష్‌పై చట్టపరంగా చర్యలు.. అయ్యప్ప భక్తులు ఆందోళన విరమించాలి: ఎస్పీ కోటిరెడ్డి

బైరి నరేష్ అనే నాస్తికుడు అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. డిసెంబరు 19న వికారాబాద్ జిల్లా రావులపల్లిలో జరిగిన సభలో అయ్యప్ప స్వామిపై నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మరికొన్ని చోట్ల కూడా అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మతపరమైన మనోభావాలను టార్గెట్ చేయడం, అవహేళన చేయడం, దెబ్బతీయడం అనే ఉద్దేశ్యంతో హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం అందరికీ ఫ్యాషన్‌గా మారిందని అన్నారు. అయితే నరేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బైరి నరేష్ యూట్యూబ్ చానల్‌ను నిషేధించాలని కోరుతున్నారు. 

click me!