ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకే రాహుల్ పాదయాత్ర: రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 6, 2022, 4:50 PM IST
Highlights

ప్రజల ఆత్మగౌరవం నిలబట్టేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. 

హైదరాబాద్:ప్రజల ఆత్మగౌరవం నిలబట్టేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.మంగళవారం నాడు హైద్రాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.

రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా దేశ ప్రజల స్వేచ్ఛ కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారన్నారు. భారత్ జోడో యాత్ర మామూలు పాదయాత్ర కాదని ఆయన చెప్పారు.దేశ సమైక్యత,సమ్రగతను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

బ్రిటీష్ పాలనలో చోటు చేసుకున్న పరిస్థితులే ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. పాలకులు మారినా కూడా వారి ఆలోచన విధానం మారలేదని  బీజేపీని రేవంత్ రెడ్డి విమర్శించారు.దేశంలో ప్రజలు ఎదుర్కొటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంటే ప్రధాని మోడీ,అమిత్ షాలు భయపడుతున్నారన్నారు. దేశ ప్రజలపై బీజేపీ దాడి చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని ఆయన అభిప్రాయపడ్డారు. భాషలు, ప్రాంతాలు, మతాలు, మనుషుల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను కాపాడేందుకు  రాహుల్ గాంధీ ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.  తమిళనాడు,కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా యాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించేందుకు ఈ ఏడాది అక్టోబర్ 24 న  కర్ణాటకలోని రాయిచూర్ నియోజకవర్గం నుండి తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర రానుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం లో రాహు్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుందని రేవంత్ రెడ్డి చెప్పారు.మక్తల్, దేవరకద్ర,మహబూబ్ నగర్, .జడ్చర్ల,షాద్ నగర్, శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు,పటాన్ చెరు, ముత్తంగి,సంగారెడ్డి,జోగిపేట, శంకరంపల్లి,మద్నూర్ మీదుగా నాందేడ్ లోకి రాహుల్ పాదయాత్ర వెళ్లనుందని రేవంత్ రెడ్డి చెప్పారు.1

5 రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన తర్వాత  మెదక్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుందని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో 350 కి.మీ సాగుతుందని టీపీసీసీ చీఫ్ చెప్పారు. తెలంగాణ ప్రజలు వందలాది మందిగా ఈ పాదయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి కోరారు. ప్రతి రోజూ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాహుల్ గాంధీ వెంట ఉంటారని రేవంత్ రెడ్డి వివరించారు.  

న్యూఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని గద్దర్ చేసిన వినతిపై పార్టీ కమిటీని ఏర్పాటు చేసి చర్చిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు ఈ విసయమై పలు పార్టీలతో కూడా చర్చించనున్నట్టుగా చెప్పారు.అంతేకాదు ఈ చర్చల సారాంశంపై నివేదికను సోనియాగాంధీకి అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం ముందుకు వస్తోంది,. వెనక్కి వెళ్తోందన్నారు.టీఆర్ఎస్ పెద్దల కుటుంబ సభ్యులకు ఈ స్కాంలో ప్రమేయం ఉందని బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేసి విషయాన్ని రేవంత్ రెడ్డి విమర్శించారు.ఇప్పటివరకు నోటీసులు ఇవ్వడం కానీ, ఇళ్లలో సోదాలు జరగలేదన్నారు. కొన్ని చోట్ల సోదాలంటున్నారని అవి చిన్న కొమ్మలు మాత్రమేనని రేవంత్ రెడ్డి చెప్పారు.ఈ స్కాంలో అసలు మూలం ప్రగతి భవన్ లో ఉందని ఆయన ఆరోపించారు. అక్రమాలకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్నారు. ప్రగతి భవన్ లో సోదాలు జరగకుండా అవినీతిపై చర్యలు అంటే నమ్మబోమని రేవంత్ రెడ్డి చెప్పారు. 2014-22 మఁధ్య పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆర్ధికస్థితిగతులపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 
 

click me!