కేసీఆర్ మళ్లీ మాతో జతకడతారేమో.. జగన్ మా వైఎస్ కొడుకే : దిగ్విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 6, 2022, 4:44 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పాదయాత్ర వల్ల తెలంగాణలో మంచి ఫలితాలుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర దేశాన్ని ఐక్యం చేసే యాత్రన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మోడీ, అమిత్ షాలు దేశాన్ని మతాలు, కులాల పేరుతో విడదీశారని ఆరోపించారు. భారత్‌ను ఏకం చేయగల శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే వుందని చెప్పారు. రేపు కన్యాకుమారి నుంచి ప్రారంభం కానున్న ‘‘భారత్ జోడో యాత్ర’’ ఏర్పాట్లను దిగ్విజయ్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లపై దిగ్విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ రాష్ట్రాన్ని తెచ్చేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తా అన్నారని, ఎక్కడ చేశారని కేసీఆర్‌ను దిగ్విజయ్ ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. మళ్లీ మాతో జతకట్టవచ్చు కదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso Read:కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర... కన్యాకుమారి టూ కాశ్మీర్.. 3,570 కిలో మీటర్ల యాత్ర.. వివ‌రాలు ఇవిగో

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ బతికే వుందని... ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు కష్టపడుతున్నారని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. రాహుల్ పాదయాత్ర వల్ల తెలంగాణలో మంచి ఫలితాలుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ మా రాజశేఖర్ రెడ్డి కొడుకున్న దిగ్విజయ్.. కాంగ్రెస్ నేత వైఎస్ కొడుకనే ప్రజలు జగన్‌ను సీఎంగా ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. కేసులు పెట్టామని జగన్ కాంగ్రెస్‌ను వదిలిపోయారని దిగ్విజయ్ ఆరోపించారు. 

click me!