కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో నలుగురు తెలంగాణ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కాగా, రాహుల్ గాంధీ పోటీపై స్పష్టత వచ్చింది.
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెలంగాణ నుంచి నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెలంగాణలో జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్లగొండ నుంచి కందుకూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌లు కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసి జాబితాను విడుదల చేసింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదంతో తొలి జాబితా విడుదలైంది. మొత్తం 39 మంది పేర్లతో తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. కాగా, ఇందులో తెలంగాణ నుంచి నలుగురి పేర్లు మాత్రమే ఉన్నాయి.
Also Read: నారీ శక్తి బలోపేతానికి మరో అడుగు: ప్రధాని మోడీపై షెహజాద్ పూనావాలా ప్రశంసలు
కాగా, రాహుల్ గాంధీ పోటీపై స్పష్టత వచ్చింది. ఆయన మళ్లీ కేరళ నుంచే పోటీ చేస్తారా? లేక యూపీ నుంచి పోటీ చేస్తారా? అనే ఉత్కంఠ ఉంది. అమేథీ నుంచి మళ్లీ ఆయన పోటీ చేస్తారని ఓ కాంగ్రెస్ నాయకుడు వెల్లడించారు కూడా. కానీ, తాజా జాబితాలో రాహుల్ గాంధీ పోటీపై స్పష్టత వచ్చింది. కేరళలోని వయానాడ్ నుంచే మరోసారి ఆయన పోటీ చేస్తున్నట్టు తొలి జాబితా ద్వారా స్పష్టమైంది.