ఈ నెల 14 నుండి ''సకల జనుల బొమ్మరిల్లు" ఫోటోగ్యాలరీ ప్రదర్శన

Published : Oct 12, 2018, 05:06 PM ISTUpdated : Oct 12, 2018, 05:09 PM IST
ఈ నెల 14 నుండి ''సకల జనుల బొమ్మరిల్లు" ఫోటోగ్యాలరీ ప్రదర్శన

సారాంశం

సామాన్యుల సహజ సుందరమైన ప్రకృతిని, వారి చెదిరిపోని మానవతను, మంత్రముగ్ధుల్ని చేసే ఆ జానపదుల విశేషాలను ఎప్పటికప్పుడు ప్రతిబింబించే కార్యక్రమాలు చేపట్టడంలో సామాన్యశాస్త్రం గ్యాలరీ ఎప్పుడూ ముందుంటుంది. ఇలా సామాన్యుల పక్షాన నిలుస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్న ఈ గ్యాలరీ ఏర్పడి రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా మరోసారి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది సామాన్యశాస్త్రం గ్యాలరీ. 

సాధారణమైన మనుషుల మంచి చెడ్డలను, వారి కష్ట సుఖాలను,వారి జీవితాలను యధాతధంగా చూపించడానికి ''సకల జనుల బొమ్మరిల్లు" పేరుతో ఓ ఫోటో గ్యాలరీని ఏర్పాటుచేసింది. సామాన్యుల జీవన చిత్రాలతో సకల జనుల బొమ్మరిల్లు పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసినట్లు నిర్వహకులు కందుకూరి రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆర్థిక సహకారంతో అక్టోబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఈ ప్రదర్శన ప్రారంభమవుతున్నదని తెలిపారు.   
 
తెలంగాణలో సంగీతం, సాహిత్యం, చిత్రకళ, రంగస్థలానికి వేదికలు ఉన్నట్టు ఫొటోగ్రఫీకీ  వేదికలు, ప్రత్యేకంగా గ్యాలరీలు లేవు.  అలాగే సామాన్యుల జీవితాలను అపూర్వంగా ఆవిష్కరించే ప్రయత్నాలు తెలుగునాట పెద్దగా జరగలేదు. ఒక వార్తగా, విశేషంగా, మానవాసక్తికర కథనంగా తప్ప సామాన్యుల జీవితాలను లెక్క చేసే వారు స్వల్పమే. ఆ దిశగా సామాన్యశాస్త్రం ఇప్పటికే ఐదు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. 

సామాన్యుడి బతుకును అప్పటికప్పుడు చూసి మరచిపోయే విధంగా కాకుండా ఆ మనిషి తాలూకు లోతైన తాత్వికతను, అతడి సౌందర్యాత్మను, వేదనను చూపించే ప్రయత్నం చేసినట్లు ''సకల జనుల బొమ్మరిల్లు" ఫోటోగ్యాలరీ ప్రదర్శన నిర్వహకులు తెలిపారు. మరీ ముఖ్యంగా, ఈ ఎన్నికల వేళ సామాన్య ప్రజలపై ఆధారపడే అన్ని రాజకీయ పక్షాలకు అసలు వారేమిటో అన్నది నిరూపించడానికి ఈ నూతన ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.అందువల్ల ఈ ఫోటోగ్యాలరీ ప్రదర్శనను ప్రతి ఒక్కరు సందర్శించాల్సిందిగా నిర్వహకులు కోరుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌