టీడీపీతో కాంగ్రెస్ పొత్తు చర్చలు: కమిటీలో రేవంత్ రెడ్డి అందుకే

By narsimha lodeFirst Published Sep 7, 2018, 11:24 AM IST
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకొంటుంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీతో పొత్తుల చర్చల కోసం  కాంగ్రెస్ పార్టీ ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది.  
 

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకొంటుంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీతో పొత్తుల చర్చల కోసం  కాంగ్రెస్ పార్టీ ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది.  

తెలంగాణలో  త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  గ్రేటర్ హైద్రాబాద్ తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహాబూబ్ నగర్ ,ఖమ్మం జిల్లాలో  టీడీపీతో పొత్తు కారణంగా ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.

 అయితే  తెలంగాణలో ఇటీవల కాలంలో టీడీపీ బలహీనపడింది. ఆ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల్లో చేరారు. అయితే క్షేత్రస్థాయిల్లో మాత్రం  క్యాడర్ , ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

దీంతో  టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలంటే అందరిని కూడ కలుపుకుపోవాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకోంటే ప్రయోజనం ఉంటుందనుకొంటున్నారు.

అయితే టీడీపీతో చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ  ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి, మధు యాష్కీ, బోస్‌రాజులు  టీడీపీతో  సీట్ల పంపకంపై చర్చించనున్నారు.

టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి... ఏఏ స్థానాలను కేటాయించాలనే విషయమై  కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ నేతలతో చర్చించనున్నారు. రెండు రోజుల క్రితం గోల్కోండ హోటల్ లో టీడీపీ నేత ఎల్. రమణతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో కూడ సీట్ల పంపకంపై చర్చించారు.

సెప్టెంబర్ 8వ తేదీన చంద్రబాబునాయుడు  హైద్రాబాద్ కు రానున్నారు.  పొత్తులపై  చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.  తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు బాబు దిశానిర్థేశం చేయనున్నారు. 

ఈ సమావేశానికి ముందే  కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీతో చర్చించే అవకాశం ఉంది.  వారం రోజుల్లోపుగా కాంగ్రెస్ పార్టీ నేతలు 50 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. 
ఈ మేరకు పొత్తులపై త్వరలోనే స్పష్టత తెచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీ పొత్తుల విషయాన్ని త్వరలోనే తేల్చనుందని ఆ పార్టీ నేతలు  చెబుతున్నారు.
 

ఈ వార్త చదవండి

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?

click me!