బాబూ మోహన్ ను కాదని టికెట్: ఎవరీ క్రాంతి?

By pratap reddyFirst Published Sep 7, 2018, 11:21 AM IST
Highlights

ఆందోల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటుడు బాబూ మోహన్ కు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ఆందోల్ నియోజకవర్గం నుంచి జర్నలిస్టు క్రాంతిని పోటీకి దించుతున్నారు. 

హైదరాబాద్: ఆందోల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటుడు బాబూ మోహన్ కు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ఆందోల్ నియోజకవర్గం నుంచి జర్నలిస్టు క్రాంతిని పోటీకి దించుతున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన క్రాంతి, తదనంతర కాలంలో ప్రభుత్వానికి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఓ టీవీ చానెల్ సీఈవోగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లోనే క్రాంతి శాసనసభ టికెట్ ఆశించారు. 

ఆందోల్ నియోజకవర్గంలో బాబూ మోహన్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి చోటు చేసుకోవడంతో అభ్యర్థిని మార్చాలని కేసిఆర్ భావించారని, అందులో భాగంగా క్రాంతికి టికెట్ ఇచ్చారని చెబుతున్నారు. కేసిఆర్ తనయుడు కేటి రామారావు ఆశీస్సులు క్రాంతికి దండిగా ఉన్నాయని అంటారు. 

ఆందోల్ నియోజకవర్గంలో క్రాంతి సోదరుడు రాజకీయంగా పలుకుబడి కలిగి ఉన్నట్లు ప్రచారంలో ఉంది. చాలా కాలంగా క్రాంతి నియోజకవర్గంపై కన్నేసి పునాదిని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. 

ఆందోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి పూర్తి పేరు చంటి క్రాంతి కిరణ్. భార్య పద్మావతి కూడా జర్నలిస్టే. తల్లిదండ్రులు చంటి కొమురమ్మ, చంటి భూమయ్య. స్వగ్రామం సంగారెడ్డి జిల్లాలోని పోతుల బొగుడా. గతంలో క్రాంతి రామచంద్రాపురంలో కాంగ్రెసు పార్టీ నుంచి జడ్పీటీసిగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

click me!