కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన... ఆ రెండు దక్కేనా?

By Arun Kumar PFirst Published Feb 28, 2019, 4:52 PM IST
Highlights

తెలంగాణ కాగ్రెస్ ఎట్టకేలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసింది. ప్రస్తుతం టిపిసిసి కోశాధికారిగా వున్న గూడూరి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫోటీ చేయనున్నరు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అదిష్టానం నిర్ణయం మేరకు టిపిసిసి ఖరారు చేసింది. 

తెలంగాణ కాగ్రెస్ ఎట్టకేలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసింది. ప్రస్తుతం టిపిసిసి కోశాధికారిగా వున్న గూడూరి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫోటీ చేయనున్నరు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అదిష్టానం నిర్ణయం మేరకు టిపిసిసి ఖరారు చేసింది. 

ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా చూసుకుంటే టీఆర్ఎస్  కు నాలుగు, కాంగ్రెస్(టిడిపి సహకారంతో) కు ఒక ఎమ్మెల్సీ స్థానం  దక్కుతుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం ఐదు స్ధానాల్లో పోటీకి సిద్దమయ్యింది. నాలుగు స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా మరో స్ధానాన్ని మిత్రపక్షం ఎంఐఎం కు కేటాయించింది. వారు కూడా తమ అభ్యర్థిని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఒక ఎమ్మెల్సీ  గెలుపుకోసం 21 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం. అయితే కాంగ్రెస్ కు సొంతంగా 19 మంది ఎమ్మెల్యేల బలం వుండగా మిత్రపక్షం టిడిపి నుండి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకే సహకరిస్తాన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలోకి దించింది. 

అయితే ఇటీవల సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తమ పార్టీ పక్షాన నిలుస్తాడా అన్న అనుమానాన్ని కాంగ్రెస్ నాయకులే వ్యక్తపరుస్తున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగుతుంన్న నమ్మకంతోనే టీఆర్ఎస్ ఐదో అభ్యర్ధిని కూడా బరిలోకి దింపిందని...తమ ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపు నల్లేరుపై నడకేమీ కాదని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. 

ఇక ఇప్పటికే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల పట్టభద్రలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. ఆయన ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరో అభ్యర్థి నారాయణ రెడ్డి కూడా గురువారం లేదా శుక్రవారం  నామినేషన్ వేయనున్నట్లు టిపిసిసి ప్రకటించింది.    

click me!