కాపీ కొడుతుంటే పట్టుకున్నారని.. బిల్డింగ్ పైనుంచి దూకేసింది

Published : Feb 28, 2019, 01:11 PM IST
కాపీ కొడుతుంటే పట్టుకున్నారని.. బిల్డింగ్ పైనుంచి దూకేసింది

సారాంశం

కాపీ కొడుతూ దొరికిపోవడంతో.. ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

కాపీ కొడుతూ దొరికిపోవడంతో.. ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కిషన్ పురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన కొలసాని వెంకటరావు కూతురు రక్షారావు హన్మకొండలోని ఎస్‌ఆర్‌ కళాశాలలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కళాశాలకు సంబంధించి పరీక్ష కేంద్రం హన్మకొండ కిషన్‌పురంలోని ఆర్‌డీ కళాశాలలో పడింది.

భవనం మూడో అంతస్తులో మొదటి పేపర్‌ సంస్కృతం పరీక్ష రాయడానికి వచ్చిన రక్షారావు.. కాపీయింగ్‌ చేస్తుండగా ఇన్విజిలేటర్‌ పట్టుకుని చీఫ్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు కాపీ చేస్తున్నావంటూ వారు ప్రశ్నిస్తుండగానే ఆందోళనకు గురైన రక్షారావు ఒక్కసారిగా భవనం నుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల నిర్వాహకులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ