కాంగ్రెస్‌లోకి విక్రంగౌడ్: నామినేటేడ్ పదవి, గోషామహల్ ఇంచార్జీ పదవి?

By narsimha lode  |  First Published Jan 11, 2024, 1:08 PM IST

బీజేపీకి రాజీనామా చేసిన విక్రంగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విక్రంగౌడ్ కు నామినేటేడ్ పదవిని కేటాయించనున్నట్టుగా హామీ ఇచ్చిందని సమాచారం.


హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన  విక్రం గౌడ్ కు  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం నుండి  స్పష్టమైన లభించిందనే ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ  గోషామహల్ ఇంచార్జీ  పదవితో పాటు  కార్పోరేషన్ పదవిని కూడ  విక్రం గౌడ్ కు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  హామీ ఇచ్చిందనే  ప్రచారం సాగుతుంది.  గతంలో  గోషామహల్ అసెంబ్లీ స్థానం నుండి విక్రం గౌడ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో విక్రం గౌడ్  కాంగ్రెస్ పార్టీని వీడి  భారతీయ జనతా పార్టీలో చేరారు. 

also read:జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

Latest Videos

undefined

2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని విక్రం గౌడ్ భావించారు. కానీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం విక్రం గౌడ్ కు  టిక్కెట్టు కేటాయించలేదు.  దీంతో విక్రం గౌడ్ అసంతృప్తితో ఉన్నారని ఆయన వర్గీయుల్లో ప్రచారం సాగుతుంది.  ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడ విక్రంగౌడ్ కు గాలం వేశారు. 

also read:ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో   రాజాసింగ్  జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  పోటీ చేస్తారని  తొలుత ప్రచారం సాగింది. రాజాసింగ్  జహీరాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేసి విజయం సాధిస్తే  విక్రంగౌడ్ ను ఈ స్థానంలో బరిలోకి దింపాలనే  యోచనలో బీజేపీ ఉందనే చర్చ కూడ లేకపోలేదు.  అయితే  జహీరాబాద్ నుండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు రాజాసింగ్  సానుకూలంగా లేరని చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విక్రం గౌడ్ బీజేపీని వీడాలని  నిర్ణయించుకున్నట్టుగా ఆయన వర్గీయులు చెబుతున్నారు.

also read:బీజేపీకి షాక్: విక్రం గౌడ్ రాజీనామా, కాంగ్రెస్‌లో చేరే అవకాశం

జీహెచ్ఎంసీ పరిధిలోని  అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయమై  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే  గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన  నేతలను తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తుంది.  ఈ క్రమంలోనే  విక్రం గౌడ్ కు  ఆ పార్టీ నాయకత్వం  గాలం వేసింది.  తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.  పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ స్థానాల్లో  విజయం సాధించాలనే టార్గెట్ తో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే  బలహీన ప్రాంతాలపై  ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలపై  కాంగ్రెస్ సర్కార్ కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకుంది.
 

click me!