దావత్ ఎంత పని చేసింది.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి..

By Sairam Indur  |  First Published Jan 11, 2024, 1:00 PM IST

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి (chicken bone struck in throat) మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో ఫరూఖ్ నగర్ ( Farooqnagar) మండలం, ఎలికట్ట (Elikatta)  గ్రామంలో జరిగింది. మృతుడిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ ( Jitendra Kumar Verma)గా పోలీసులు గుర్తించారు.


సరదాగా స్నేహితుడితో కలిసి చేసుకున్న దావత్ మరో స్నేహితుడి ప్రాణాల తీసింది. మద్యం తాగుతూ, చికెన్ తినే సమయంలో ఎముక గొంతులో ఇరుక్కోవడంతో అతడు ఒక్క సారిగా నేలకొరికాడు. కొన్ని క్షణాల్లోనే మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2027-28 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ - నిర్మలా సీతారామన్

Latest Videos

undefined

వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం, ఎలికట్ట గ్రామానికి జార్ఖండ్ రాష్ట్రం నుంచి జితేందర్‌కుమార్ వర్మ, ధర్మేంధర్‌వర్మ అనే ఇద్దరు స్నేహితులు కొంత కాలం క్రితం వలస వచ్చారు. ఇదే గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని స్థానికంగా దొరికే కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 8వ తేదీన సోమవారం కూడా కూలి పనులకు వెళ్లారు. 

సాయంత్రం గదికి తిరిగి వచ్చారు. అయితే ఆ రోజు రాత్రి స్నేహితులు దావత్ చేసుకుందామని ప్లాన్ చేశారు. దాని కోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న చికెన్ సెంటర్ నుంచి చికెన్ తెచ్చుకున్నారు. అనంతరం చికెన్ కర్రీ తయారు చేసుకున్నారు. అలాగే ఆ కర్రీతో తినేందుకు పూరీలు, అన్నం సిద్ధం చేసుకున్నారు. దావత్ లో మద్యం లేకపోతే ఎలా అని దానిని కూడా తెచ్చుకున్నారు.

బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చండి..: కేటీఆర్ తో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు

వంటకాలు అన్నీ ముందు పెట్టుకొని స్నేహితులు ఇద్దరూ కలిసి మద్యం తాగడం ప్రారంభించారు. ఇలా తాగుతూ చికెన్ లో నంజుకుంటూ పూరీలు కూడా తినడం మొదలుపెట్టారు. అయితే ఇలా మద్యం తాగుతూ చికెన్ తింటున్న క్రమంలో జితేందర్‌కుమార్ వర్మ  (46) గొంతులో ఎముక ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఒక్క సారిగా కింద పడిపోయాడు. అంతసేపు తనతో సరదాగా ఉంటూ మద్యం తాగిన స్నేహితుడు కింద పడిపోవడంతో ధర్మేంధర్ వర్మకు ఏం అర్థం కాలేదు.

చూడకుంటా తింటే హాస్పిటల్ కే.. ప్రముఖ రెస్టారెంట్ లోని బిర్యానీలో చచ్చిన బొద్దింక..

స్నేహితుడిని ఎంత లేపిన ఊలుకూ పలుకూ లేకుండా పడి ఉండటంతో పరిగెత్తకుంటూ వెళ్లి ఇరుగు పొరుగువారికి సమాచారం ఇచ్చాడు. వారి సాయంతో హాస్పిటల్ కు తరలించాడు. అయితే అప్పటికే వర్మ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో మరణించాడని తేలిందని డాక్టర్లు తెలిపారు. స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

click me!