తెలంగాణ సచివాలయం కూల్చివేత: ఎన్జీటీలో రేవంత్ రెడ్డి పిటిషన్

By narsimha lodeFirst Published Jul 16, 2020, 5:27 PM IST
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చెన్నై బెంచీలో విచారణ జరిగింది.
 

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చెన్నై బెంచీలో విచారణ జరిగింది.

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్: రేపటి వరకు స్టే పొడిగించిన హైకోర్టు

తెలంగాణ సచివాలయం కూల్చివేత పర్యావరణానికి సంబంధించిన విషయమైనందున ఎన్జీటీలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ  ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ శాఖలను కూడ ప్రతివాదులుగా చేర్చారు. పర్యావరణ అనుమతులు రాకుండానే సచివాలయం కూల్చివేస్తున్నారని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 

ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగుతున్న విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టులో విచారణ పూర్తైన తర్వాత ఈ విషయమై వాదనలను వింటామని  ఎన్జీటీ ప్రకటించింది.  ఈ పిటిషన్ పై విచారణను  సోమవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులపై స్టే ను ఈ నెల 17వ వరకు పొడిగించింది తెలంగాణ హైకోర్టు. సచివాలయం కూల్చివేత విషయంలో పర్యావరణ అనుమతులు తీసుకోవాలో వద్దో అనే విషయమై స్పష్టత కోసం తెలంగాణ హైకోర్టు నోటీసులు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

click me!