కరోనా కలకలం: కోవిడ్‌తో హైద్రాబాద్‌లో మరో వజ్రాల వ్యాపారి మృతి

Published : Jul 16, 2020, 03:36 PM IST
కరోనా కలకలం: కోవిడ్‌తో హైద్రాబాద్‌లో మరో వజ్రాల వ్యాపారి మృతి

సారాంశం

కరోనాతో హైద్రాబాద్ లో మరో వజ్రాల వ్యాపారి గురువారం నాడు మరణించాడు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కరోనా సోకింది. మృతుడికి సోదరులిద్దరూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స తీసుకొంటున్నారు.


హైదరాబాద్: కరోనాతో హైద్రాబాద్ లో మరో వజ్రాల వ్యాపారి గురువారం నాడు మరణించాడు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కరోనా సోకింది. మృతుడికి సోదరులిద్దరూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స తీసుకొంటున్నారు.

హైద్రాబాద్ పాతబస్తీలోని ఝాన్సీబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది.  వజ్రాల వ్యాపారి కుటుంబం మొత్తం కరోనాతో బాధపడుతుంది. ఇటీవల జరిగిన పలు బర్త్ డే పార్టీలకు, పెళ్లిళ్లకు వజ్రాల వ్యాపారి హాజరయ్యారు.

also read:సిద్దిపేట ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం: ఐసీయూలోనే కరోనా రోగి డెడ్‌బాడీ

ఇప్పటికే హైద్రాబాద్ లో ఇద్దరు వజ్రాల వ్యాపారులు కరోనాతో మరణించారు.  ఈ నెల 5వ తేదీన హిమాయత్ నగర్ కు చెందిన వజ్రాల వ్యాపారి కరోనాతో మరణించారు. ఆయన పుట్టిన రోజు పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు వ్యాపారులు కూడ హాజరయ్యారు.

ఈ పుట్టిన రోజు పార్టీకి హాజరైన మరో వ్యాపారి కూడ మరణించాడు. ఈ పార్టీకి సుమారు 150 మంది హాజరయ్యారని ప్రచారం సాగింది. తాజాగా మరో వ్యాపారి మరణించడంతో ఆందోళన నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో 39,342కి కేసులు చేరాయి. నిన్న ఒక్క రోజే  రాష్ట్రంలో 1597 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదౌతున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డౌతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ