
మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. ఆ సంస్థకు జరిగిన భూ కేటాయింపులపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. రాయదుర్గంలో వందల కోట్లు విలువ చేసే భూమిని మైహోమ్‌కు కేటాయించారని రేవంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రూ.38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని ఆయన తెలిపారు. రేవంత్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రామేశ్వరరావుతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి, డీఎల్‌ఎఫ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.
Also Read:ఒకే ఫ్రేములో కేసీఆర్, రేవంత్: చేతిలో చెయ్యేసి.... చూడడానికి రెండు కళ్ళు చాలవు
అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. మరోవైపు రేవంత్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో రాయదుర్గం ప్రాంతంలో మైహోమ్ సంస్థ నిర్మిస్తున్న భూజా వెంచర్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లి మండలం, రాయదుర్గం గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 83లో 424.13 ఎకరాల భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో జీవో నెంబర్ 161 ద్వారా ఏపీఐఐసీకి కేటాయించింది.
Also Read:ఏపీ రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డి స్పందన ... జగన్ కి హెచ్చరికలు
పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం ద్వారా ఈ భూమి ప్రభుత్వానికి సంక్రమించింది. అదే సమయంలో ఈ భూమి ఐటీ జోన్ పరిధిలో ఉన్నందున ఐటీ పార్క్, ఐటీ సంబంధిత ఇన్‌ఫ్రా నిర్మాణాల కోసమే వినియోగించాలని రాష్ట్ర ఐటీ పాలసీ ద్వారా స్పష్టంగా పేర్కొంది.
తదనంతర కాలంలో ఈ భూమి డీఎల్‌ఎఫ్‌కు ఆ తర్వాత అక్కడి నుంచి మై హోంకు షెల్ కంపెనీగా ప్రచారం జరుగుతున్న అక్వా స్పేస్ డెవలపర్స్‌కు బదలాయింపు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ భూ కేటాయింపుల్లో అనేక అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ భూ బదలాయింపులను రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును కోరుతున్నారు.