తెలంగాణ సచివాలయం కూల్చివేత: సుప్రీంకోర్టుకెక్కిన రేవంత్ రెడ్డి

By Siva KodatiFirst Published Sep 15, 2020, 8:42 PM IST
Highlights

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సచివాలయం కూల్చివేతతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Aloso Read: మనసులో దేవుడుంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు: హైకోర్టు

సచివాలయం కూల్చివేతపై ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి రేవంత్ ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరానికి వచ్చిన ఎన్జీటీ బృందాన్ని ఆయన కలిశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు పలు శాఖలు ఇచ్చిన అనుమతులు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని కమిటీకి వివరించారు.

హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఒక కిలోమీటర్ పరిధి వరకు ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదంటూ 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రేవంత్ రెడ్డి కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 2001 తర్వాత ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదని రేవంత్ జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ బృందానికి వివరించారు. 

click me!