అంబేద్కర్ విగ్రహాన్ని జైల్లోపెట్టించి... కేసీఆర్ అహంకారమిదీ...: ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

By Arun Kumar PFirst Published Jun 17, 2021, 4:01 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏడేళ్లు పూర్తిచేసుకున్నారని... ఇన్నేళ్లలో ఒక్కసారికూడా అంబేద్కర్ కు ఆయన నివాళి అర్పించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగ అహంకారంతో విర్రవీగే సీఎంను తానెక్కడా చూడలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు అంబేద్కర్ విగ్రహం కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోకపోవడంపై కోమటిరెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని జైల్లో పెట్టారంటేనే సీఎం కేసీఆర్ సిగ్గుపడాలని కోమటిరెడ్డి అన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏడేళ్లు పూర్తిచేసుకున్నారని... ఇన్నేళ్లలో ఒక్కసారికూడా అంబేద్కర్ కు ఆయన నివాళి అర్పించలేదని గుర్తుచేశారు. హైదరాబాద్ లో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని కోమటిరెడ్డి విమర్శించారు. 

తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారని తెలిపారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని కోమటిరెడ్డి మండిపడ్డారు. 

read more  పంజాగుట్టలో ఉద్రిక్తత... అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై దళిత సంఘాల ఆగ్రహం

రెండేళ్ల క్రితం హైద్రాబాద్ పంజగుట్ట సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఈ విగ్రహన్ని తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని  కోరుతూ వి. హనుమంతరావు అప్పటినుండి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా హనుమంతరావు దీక్ష కూడా చేశారు.  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విగ్రహాన్ని  తెలంగాణ ప్రభుత్వం ఈ విగ్రహన్ని తొలగించిందని హనుమంతరావు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలంగా హన్మంతరావు ఆందోళన చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంపై కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. 

 

click me!