తెలంగాణ వాతావరణ సమాచారం... రానున్న మూడురోజులు వర్షపాతం ఎలా వుండనుందంటే...

By Arun Kumar PFirst Published Jun 17, 2021, 3:06 PM IST
Highlights

పశ్చిమ, నైరుతి, మధ్య తెలంగాణా జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్: తెలంగాణలో  రాగల మూడురోజులు (17,18, 19వ తేదీలు) తేలికపాటి నుండి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో (ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, మధ్య తెలంగాణా జిల్లాలలో) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే నైరుతి, పశ్చిమ దిశల నుండి గాలులు బలంగా వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే తెలంగాణకు చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల ప్రారంభంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత మూడేళ్లలో తొలిసారిగా తెలంగాణ‌లోకి  నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే వచ్చాయని తెలిపారు.

రుతుపవనాల ప్రవేశంతో రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలయిన మేడ్చల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసాయి. సిద్దిపేట, సిరిసిల్ల కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.  తెలంగాణతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోనూ చాలా ప్రాంతాలకు నైరుతి రుతుప‌వ‌నాలు ప్రవేశించినట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 
 


 

click me!