నాకు గౌరవం ఇవ్వాలి.. అప్పుడే పనిచేస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 20, 2023, 7:47 PM IST
Highlights

పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వడంతో పాటు అందరి సమిష్టి నిర్ణయలుంటేనే ఉత్సాహంగా పనిచేస్తానన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శుక్రవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో ఆయన భేటీ అయ్యారు. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో భేటీ అయిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. కమిటీలో తాను చెప్పిన పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కాలని.. అందరి సమిష్టి నిర్ణయాలు వుండాలన్నారు. ఇవన్నీ జరిగితే తాను మరింత ఉత్సాహంతో పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 

అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చారు. అంతేకాదు.. గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కనని తాను అనలేదన్నారు. కొత్త ఇన్‌ఛార్జ్ ఆహ్వానించడంతో వచ్చానని ఆయన తెలిపారు. గాంధీ భవన్‌తో తనకు 30 ఏళ్ల అనుబంధం వుందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలి అనే అంశంపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ALso REad: గాంధీ‌భవన్‌కొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్‌ రెడ్డితో భేటీ, ఆసక్తికర చర్చ

ఇకపోతే.. ఎఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్లబుట్టలో  పడ్డాయని  కొద్దిరోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.షోకాజ్  నోటీస్ అనేది లేనే లేదన్నారు .  గాంధీభవన్ కు ఇతర నేతలు  కూడా రాలేదని ఆయ న చెప్పారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.నాలుగైదు సార్లు  ఓటమిపాలైనవారితో తాను కూర్చోవాలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందున ప్రజల్లోకి వెళ్లి యుద్ధం చేయాలన్నారు.ఈ విషయమై  ఠాక్రే కొన్ని సలహాలు చెప్పారన్నారు. తాను కూడా  కొన్ని అంశాలను మాణిక్ రావుకు  చెప్పినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన గురించి ఠాక్రేకు తెలుసునన్నారు.

click me!