బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

By narsimha lode  |  First Published Feb 8, 2024, 3:26 PM IST


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.  ఈ సమావేశాలు  ఈ నెల  13వ తేదీ వరకు సాగనున్నాయి.


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  ఎమ్మెల్సీ  బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో  వచ్చారు.  బల్మూరి వెంకట్ కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ గా నామినేట్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా  బల్మూరి వెంకట్ ఇటీవలనే ప్రమాణం చేశారు.  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. 

 


మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వెళ్లిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు....

నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి వచ్చిన MLC...

ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడి వారి అభిప్రయాలు తెలుసుకున్న ఎమ్మెల్సీ. pic.twitter.com/dQSMum3KhG

— Venkat Balmoor (@VenkatBalmoor)

Latest Videos

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ వెంకట్  ఆర్టీసీ బస్సును ఆశ్రయించారు.  ఆర్టీసీ  బస్సులో మహిళా ప్రయాణీకులను  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అసెంబ్లీ వద్ద  ఆర్టీసీ బస్సు దిగిన  బల్మూరి వెంకట్  తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద  నివాళులర్పించారు. అమరవీరుల ఆశీస్సులతోనే తాను  ఈ స్థాయికి వచ్చినట్టుగా  చెప్పారు. అనంతరం ఆయన  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లారు.  

also read:అయోధ్య,కాశీ, మధురలను హిందువులు కోరుకుంటున్నారు: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఈ నెల  13 వ తేదీ వరకు  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ నెల 10వ తేదీన తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.తెలంగాణ అసెంబ్లీలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ సమావేశాలకు  సీపీఐ(ఎం) సభ్యుడు సున్నం రాజయ్య బస్సులో  హాజరయ్యేవాడు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం  ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండు స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ  రెండు స్థానాల్లో విజయం సాధించింది. మహేష్ కుమార్ గౌడ్,  బల్మూరి వెంకట్ లకు ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. అసెంబ్లీలో సంఖ్యాబలం మేరకు కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు స్థానాలు దక్కాయి.

 

click me!