టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్: కారెక్కనున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 9:03 PM IST
Highlights

అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు సైతం రాజీనామా చేస్తామంటూ ప్రకటించారు. గత కొంతకాలంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యుల సంఖ్య 17కు పడిపోయింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. ఆదివారం ఉదయం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆయా పార్టీల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. 

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 

అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు సైతం రాజీనామా చేస్తామంటూ ప్రకటించారు. గత కొంతకాలంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యుల సంఖ్య 17కు పడిపోయింది. 

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కలిశారు. ఆయన కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. 

click me!