కేసీఆర్ తో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర భేటీ: మతలబు అదేనా...

By telugu teamFirst Published Mar 2, 2019, 4:40 PM IST
Highlights

సాగర్‌ ఎడమకాల్వ నుంచి నీరు విడుదల చేయాలని సండ్ర కేసీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు. సండ్ర విజ్ఞప్తిపై కేసీఆర్ వెంటనే స్పందించారు. నీరు విడుదల చేయాలని సీఎస్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. 

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావును కలిశారు. శనివారంనాడు ప్రగతిభవన్ లో ఆ భేటీ జరిగింది.

సాగర్‌ ఎడమకాల్వ నుంచి నీరు విడుదల చేయాలని సండ్ర కేసీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు. సండ్ర విజ్ఞప్తిపై కేసీఆర్ వెంటనే స్పందించారు. నీరు విడుదల చేయాలని సీఎస్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. 

సండ్ర టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని, ఆయనకు మంత్రి కూడా ఖాయమైందనే ప్రచారం ఇటీవల ముమ్మరంగా జరిగింది. ఈ స్థితిలో సండ్ర కేసీఆర్ ను కలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో వారిద్దరు కూడా అధికార పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే మెచ్చా తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చారు. అయితే తాను మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సండ్ర ఇటీవల చెప్పారు.

click me!