దక్షిణ తెలంగాణా జిల్లాల మధ్య చిచ్చు పెట్టొద్దు...

First Published Feb 21, 2017, 11:53 AM IST
Highlights

'మాకు నీళ్లు ఇచ్చాక డిండికే కాదు మీ ఫార్మ్ హౌసుకు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు.'

 

 టిఆర్ ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణా జిల్లా మధ్య నీటి చిచ్చు పెడుతూ ఉందని కల్వకుర్గి శాసన సభ్యుడు (కాంగ్రెస్) వంశీ చంద్ రెడ్డి ఆరోపించారు.

 

కే.ఎల్.ఐ నీటిపై హక్కు ఉన్న కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు నీరు ఇవ్వకుండా, ఏ హక్కు లేని నల్లగొండ జిల్లాకు దొడ్డిదారిన నీళ్లు మళ్లించటాన్ని  జిల్లా, ప్రాంత రైతాంగం తరపున  తాను  ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది రెండు దక్షిణ తెలంగాణా జిల్లాల మధ్య వైషమ్యం రగిలించడమే నని ఆయన చెప్పారు.

 

ఇదే అంశాన్ని తాను  గడిచిన అసెంబ్లీ సామావేశాల్లో ప్రస్తావించినప్పుడు  హరీష్ రావు  ఈ  ప్రాంతానికి సిరసవాడ నుంచి నీళ్లు ఇస్తాం అని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పినారని ఆయన విమర్శించారు.

 

‘హక్కుగా ఉన్న మాకు నీళ్లు ఇచ్చిన తర్వాత మీరు డెండీ కే కాదు మీ ఫార్మ్ హౌసుకు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు,’ అని ఆయన అన్నారు.

 

కుట్రతో ప్రభుత్వం దక్షిణ తెలంగాణా జిల్లాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తోందని ఇది ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.

 

ఈ వ్యవహారంలో నాగర్కర్నూల్ జిల్లా మంత్రి, అధికార పార్టీ సభ్యులు స్పందించాలి.

 

 TRS ప్రభుత్వం, పాలమూడు రైతులపై చేస్తున్న కుట్రకు సమాధానం రేపు డిండిలొనే ఇస్తామని ఆయన అన్నారు.

 

సాగునీటికే కాదు, తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్న మా ప్రాంత రైతాంగానికి అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకోమని వంశీ హెచ్చరించారు.

 

click me!