
జడ్చర్ల జనగర్జన సభలో అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సిఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.
గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీకి సిఎం కేసిఆర్ పాదాభివందనం చేసినప్పుడు ఇప్పటి రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ కు ఎందుకు పాదాభివందనం చేయలేదని నిలదీశారు.
కోవింద్ దళితుడు కాబట్టే ఆయన కాళ్లు మొక్కలేదా? అని ప్రశ్నించారు. కేసిఆర్ దొర పోడకలను జనాలు చూస్తున్నారని హెచ్చరించారు.
కేసీఆర్ కు ఊక దంపుడు క్యాబినెట్ మంత్రిగా గవర్నర్ మారిపోయిండని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచేస్తున్న ఆ నలుగురి పై ప్రజలు తిరగబడాలన్నారు.
తెలంగాణ లో జన గర్జన తో కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయన్నారు.
మూడేళ్ల లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఆరోపించారు.
2019లో కాంగ్రెస్ ప్రభంజనం వస్తుందని, ఉత్తమ్ ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి లక్ష్మారెడ్డి పరిపాలన గాలికొదిలేసి బిజినెస్ లో బిజీ అయిపోయారని విమర్శించారు.