కేసిఆర్ ఖమ్మంలో హెలిక్యాప్టర్ ఇలా దిగారు (వీడియో)

Published : Dec 20, 2017, 06:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
కేసిఆర్ ఖమ్మంలో హెలిక్యాప్టర్ ఇలా దిగారు (వీడియో)

సారాంశం

ఎంపి పొంగులేటి తండ్రి మరణానికి కేసిఆర్ సంతాపం హెలిక్యాప్టర్ లో ఖమ్మం వెళ్లి పరామర్శించి వచ్చిన సిఎం కేసిఆర్ తో పాటు హోంమంత్రి నాయిని కూడా

ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రి మరణించినందున ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం సిఎం కేసిఆర్ హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో ఖమ్మం వెళ్లారు. ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ కు స్వాగతం పలికేందుకు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి తదితరులు హెలిప్యాడ్ వద్ద వేచి ఉన్నారు. వారంతా సిఎం రాగానే స్వాగతం పలికారు.

 

అక్కడి నుంచి నేరుగా ఎంపి పొంగులేటి నివాసానికి వెళ్లిన కేసిఆర్ పొంగులేటి తండ్రి ఫొటోకు నివాళులు అర్పించారు. పొంగులేటి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం సిఎం హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. సిఎంతో పాటు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి కూడా ఈ టూర్ లో ఉన్నారు.

కేసిఆర్ హెలిక్యాప్టర్ లో వచ్చిన వీడియో కింద చూడండి. పార్టీ నేతలంతా ఆయనకు స్వాగతం పలికారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Cold Wave Alert | వాతావరణ పరిస్థితులపై IMD ధర్మరాజు కీలక సమాచారం | Asianet News Telugu
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!