మంత్రి ఎర్రబెల్లితో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య భేటీ.. మరోసారి తెరపైకి ఆ ప్రచారం..!

By Sumanth KanukulaFirst Published Dec 27, 2022, 2:25 PM IST
Highlights

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీ మారబోతున్నారనే వార్తలు మరోసారి జోరందుకున్నాయి. ఇందుకు కారణంగా పొదెం వీరయ్య ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో భేటీ కావడమే.

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీ మారబోతున్నారనే వార్తలు మరోసారి జోరందుకున్నాయి. ఇందుకు కారణంగా పొదెం వీరయ్య ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో భేటీ కావడమే. మంగళవారం హనుమకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్యే పొదెం వీరయ్య చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే భద్రాచలంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ గురించి మాత్రమే తాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో చర్చించినట్టుగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు.అయితే ఈ భేటీ రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. 

అయితే కొంతకాలంగా వీరయ్య.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టలో చేరతారనే ప్రచారం సాగుతుంది. పొదెం వీరయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలంకు బదులు ములుగు నుంచి బరిలో దిగుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల పొదెం వీరయ్య మాట్లాడుతూ.. ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను వచ్చే ఎన్నికల్లో భద్రాచలం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. తను భద్రాచలం ప్రజలే దేవుళ్లు అని కామెంట్ చేశారు. అయితే పొదెం వీరయ్య ఎన్నిసార్లు చెప్పినప్పటికీ.. ఆయన పార్టీ మార్పుకు సంబంధించిన ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. 

click me!