ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: రెండో రోజూ నందకుమార్ ను విచారిస్తున్న ఈడీ అధికారులు

By narsimha lode  |  First Published Dec 27, 2022, 1:31 PM IST

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  ఈడీ అధికారులు  మంగళవారంనాడు నందకుమార్ ను ప్రశ్నిస్తున్నారు. నిన్న  కూడా  ఈడీ అధికారులు నందకుమార్ ను నాలుగు గంటలపాటు  ప్రశ్నించారు


హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  నందకుమార్ ను  మంగళవారంానాడు ఈ డీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న కూడా  ఈడీ అధికారులు  నందకుమార్ ను  ప్రశ్నించారు. నిన్న నాలుగు గంటలపాటు  ఈడీ అధికారులు నందకుమార్ ను విచారించారు.  ఇవాళ రెండో రోజున  నందకుమార్ ను విచారిస్తున్నారు. అబిషేక్ ఆవాల,  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పరిచయాల గురించి  ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది.   ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి  నిన్న  ఈడీ అధికారులు  నందకుమార్ ను విచారించినట్టుగా  ప్రచారం  సాగింది.నందకుమార్ విచారణకు సంబంధించిన నివేదికను ఈడీ అధికారులు కోర్టుకు అందించనున్నారు. 

ఇదిలా ఉంటే  ఎమ్మెల్యే ప్రలోభాల కేసులో  తాండూరు ఎమ్మెల్యేల పైటెట్ రోహిత్ రెడ్డిని  ఈడీ అధికారులు ఇవాళ  విచారణకు రావాలని ఆదేశించారు. అయితే  మధ్యాహ్నం వరకు  ఈడీ  విచారణకు  పైటెల్ రోహిత్ రెడ్డి హాజరు కాలేదు.ఈ విషయమై  తన న్యాయవాదుల సూచనలతో  నిర్ణయం తీసుకుంటానని  రోహిత్ రెడ్డి  ప్రకటించారు.

Latest Videos

ఈ ఏడాది అక్టోబర్  26న  మెయినాబాద్ ఫాం హౌస్ లో  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేశస్తూ  ముగ్గురు పోలీసులకు చిక్కారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు. ఇటీవలనే  హైకోర్టు ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది.  అయితే మరో కేసులో నందకుమార్ ప్రస్తుతం  చంచల్ గూడ జైలులో ఉన్నారు.  జైల్లోనే  నందకుమార్ ను ఈడీ అధికారులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. 

also read:న్యాయవాదుల సూచన మేరకు నడుచుకొంటాం: ఈడీ విచారణ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి,  పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులను  ప్రలోభాలకు గురి చేశారని  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు దేశ వ్యాప్తంగా  సంచలనం కలిగించింది.  ఈ కేసు విచారణకు  తెలంగాణ ప్రభుత్వం సిట్  ను ఏర్పాటు చేసింది.  అయితే  ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిన్ననే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఈడీ విచారణ కూడా  సాగుతుంది.  అయితే  ఈ కేసు విషయమై  పైలెట్ రోహిత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   ఈడీకి ఈ కేసుతో  సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


 

click me!