బీఆర్ఎస్‌లో భవిష్యత్తు లేదు, కాంగ్రెస్‌లో చేరాలి: హరీష్‌రావుకు కోమటిరెడ్డి ఆఫర్

By narsimha lode  |  First Published Feb 12, 2024, 7:22 PM IST

హరీష్ రావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.


హైదరాబాద్: కష్టపడే హరీష్ రావుకు  బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేదని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు అసెంబ్లీ లాబీల్లో  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నారని  హరీష్ రావుపై  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 20 మంది ఎమ్మెల్యేలతో  కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు చేరితే  దేవాదాయ శాఖ మంత్రి పదవిని ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హరీష్ రావు పాపాలు కడుక్కోవచ్చని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

హరీష్ రావు, కడియం శ్రీహరి మాదిరిగా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదన్నారు. కడియం, హరీష్ లు  మమ్మల్ని చీల్చాలని చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఆరోపించారు. తాము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉన్నామన్నారు.  బీఆర్ఎస్ ఇలాంటి చిల్లర పాలిటిక్స్ మానుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని ఆయన విమర్శలు  చేశారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై పడిందన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారనే ఆరోపణతో  నిర్వహిస్తున్న నల్గొండ సభ ప్లాఫ్ అవుతుందని ఆయన ఆరోపించారు.

Latest Videos

undefined

also read:కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ  కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దని చేసిన తీర్మానంపై  చర్చ సందర్భంగా  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పై  తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు  ప్రసంగిస్తున్న సమయంలో కూడ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోక్యం చేసుకుని  బీఆర్ఎస్ సర్కార్ పై  విమర్శలు చేశారు.

also read:కృష్ణా నదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించొద్దు: తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

రేపు  నల్గొండలో బీఆర్ఎస్ సభ గురించి కూడ వ్యాఖ్యలు చేశారు.  నల్గొండకు అన్యాయం చేసినందుకే బీఆర్ఎస్ కు నల్గొండ జిల్లాలోని  12 స్థానాల్లో  11 స్థానాల్లో  కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. సూర్యాపేటలో కూడ తమదే నైతిక విజయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. 
 

click me!