తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దనే విషయమై ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది.ఈ తీర్మానంపై పలు పార్టీల సభ్యులు చర్చించారు.
హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించవద్దని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా సోమవారం నాడు తీర్మానం చేసింది.
ఈ విషయమై ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది.ఈ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. భారత రాష్ట్ర సమితి తరపున హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్షం తరపున పలువురు మంత్రులు ప్రసంగించారు. మంత్రుల తమపై చేసిన విమర్శలకు హరీష్ రావు కూడ అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
undefined
also read:కేసీఆర్ లక్షణాలొచ్చాయి: తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావుపై కోమటిరెడ్డి సెటైర్లు
ఈ తీర్మానంపై అన్ని పార్టీలు చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చ ముగిసిన తర్వాత తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రేపు ఎమ్మెల్యేలను తీసుకెళ్లనున్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.ఈ విషయమై ఎమ్మెల్యేలకు తాను వ్యక్తిగతంగా లేఖలు కూడ పంపినట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రేపు అసెంబ్లీ నుండి మేడిగడ్డకు వెళ్తామని మంత్రి వివరించారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ మాసంలో కుంగిపోయాయి. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ విచారణలో కూడ కీలక అంశాలు బయటకు వచ్చాయి.