కేసీఆర్ లక్షణాలొచ్చాయి: తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావుపై కోమటిరెడ్డి సెటైర్లు

By narsimha lode  |  First Published Feb 12, 2024, 2:45 PM IST

తెలంగాణ అసెంబ్లీలో  నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై  జరిగిన చర్చ సందర్భంగా  అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది.



హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే  హరీష్ రావుకు  మేనమామ (కేసీఆర్) లక్షణాలు ఎక్కువగా వచ్చాయని  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో  సోమవారం నాడు  కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ  సంబంధిత అంశాలపై  రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది.ఈ  విషయమై   సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య  మాటల యుద్ధం సాగింది. భారత రాష్ట్ర సమితి  ఎమ్మెల్యే  హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  జోక్యం చేసుకున్నారు.   బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.

 తెలంగాణ పదం  మీ పార్టీ నుండి తొలగించినప్పుడే   మీ పార్టీ పని అయిపోయిందన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే  ముఖం లేకనే  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  ఇవాళ అసెంబ్లీకి రాలేదని ఆయన  విమర్శించారు. 

Latest Videos

undefined

also read:మేడిగడ్డ విజిలెన్స్ విచారణలో దోషులెవరో తేలుతారు: మీడియా చిట్ చాట్‌లో రేవంత్ సంచలన వ్యాఖ్యలు

అధికారం శాశ్వతం అని బీఆర్ఎస్ భావించిందని ఆయన విమర్శించారు.తెలంగాణ ఉద్యమంలో  కేసీఆర్ కుటుంబ సభ్యులకు చిన్న గాయమైనా అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో  ఆనాడు  ఎంపీలుగా ఉన్న తాను , పొన్నం ప్రభాకర్ సహా ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:మీ విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించనుందా?: గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు

జగన్ తో  కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.  అందుకే నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. హరీష్ కు మేనమామ పోలికలు వచ్చాయన్నారు. అందుకే  కేసీఆర్ కంటే ఎక్కువగా అబద్దాలు చెబుతున్నారన్నారు.   అధికారంలో ఉన్న సమయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నీటిని తీసుకెళ్తున్నా కూడ  పట్టించుకోకుండా రేపు నల్గొండలో  బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయడాన్ని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  తప్పుబట్టారు.  అందుకే  మొన్న జరిగిన ఎన్నికల్లో  ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు  11 అసెంబ్లీ కట్టబెట్టారన్నారు.సూర్యాపేటలో కూడ తమ పార్టీదే నైతిక విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.
 

click me!