అమిత్ షాతో భేటీ వాస్తవమే: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Published : Jul 22, 2022, 01:17 PM ISTUpdated : Jul 22, 2022, 01:33 PM IST
 అమిత్ షాతో భేటీ వాస్తవమే: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సారాంశం

కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన మాట వాస్తవమేని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రకటించారు.


హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి Amit shahను కలిసింది నిజమేనని మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy ప్రకటించారు. పార్టీలో మార్పునకు సంబంధించి గతంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. పార్టీ మార్పుపై కీలక సమయంలో నిర్ణయం తీసుకొంటానని ఆయన ప్రకటించారు. 

KCR ను ఓడించే పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. కే. చండూరులో ఏర్పాటు చేసిన సమావేశం రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసింది కాదని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసం తమకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గానికి  నిధులు రాకుండా TRS  అడ్డుకుంటుందన్నారు. ఈ విషయమై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్టుగా రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు.

BJP ఎంపీ నిశికాంత్ దూబే  మధ్యవర్తిత్వంతో అమిత్ షాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసినట్టుగా బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. బీజేపీలో చేరాలని అమిత్ షా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానించినట్టుగా సమాచారం.  ఈ విషయమై రాజగోపాల్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారంలో ఉంది. 

గత కాంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో చేరడానికి ఆయన చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. గతంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్ రెడ్డి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై సమావేశంలోనే నిరసన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. 

మరో వైపు ఓ పార్టీ కార్యకర్తతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆడియో సంభాషణ కూడా గతంలో వైరల్ గా మారింది. బీజేపీలో చేరే విషయమై ఆయన ఈ ఆడియో సంభాషణలో ప్రస్తావించారు. ఆ తర్వాత తిరుపతిలో వెంకన్నను దర్శించుకొన్న తర్వాత బీజేపీలో చేరుతానని కూడా ఆయన ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలంగా పార్టీ మార్పుపై స్పందించలేదు. 

also read:తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్: బిజెపిలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను ఓడించే పార్టీలోనే చేరుతతానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ అనేది మాత్రం స్పష్టం  చేయలేదు. అయితే తాజాగా అమిత్ షాతో భేటీ కావడంతో బీజేపీలో చేరుతారని  ప్రచారంలో ఉంది. అయితే ఇవాళ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో  గతంలోని ప్రకటనను ప్రస్తావించారు.

గతంలో కోమటిరెడ్డి సోదరులిద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం కూడ  సాగింది. అయితే ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలోనే స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  విమర్శలు చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కాలంలో కాస్త మెత్తబడ్డారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ పదవి బాధ్యతలను కూడా  వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం కట్టబెట్టింది.  రేవంత్ రెడ్డి కూడా వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి గతంలో భేటీ అయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే