మర్యాదపూర్వకంగానే అమిత్ షాను కలిసినట్టుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో తాను బీజేపీ చేరిక విషయమై చర్చించలేదన్నారు. గతంలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్: Amit Shah షాను మర్యాద పూర్వకంగానే కలిసినట్టుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే BJP లో చేరిక గురించి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై ,చర్చించలేదని స్పష్టం చేశారు.
ఆదివారం నాడు Komatireddy Rajagopal Reddy హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. KCR కుటుంబంపై తాను రాజీలేని పోరాటం చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపంచారు. తమ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రాజగోపాలల్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా తానే ఏ నిర్ణయం తీసుకోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. TRS నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి వివరించారు.
undefined
తాను గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన మాట వాస్తవమేనన్నారు.కానీ, బీజేపీలో చేరిక గురించి ఎప్పుడూ కూడా ప్రకటించలేదన్నారు.తనకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే తాను కొన్ని మాటలు మాట్లాడినట్టుగా ఆయన వివరించారు. తాను రాజీనామా చేయాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు.
తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు. టీఆర్ఎస్ ఉసిగొల్పితే ఎన్నికలకు వెళ్లబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. అమిత్ షాను కలిసినందున తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ కు చెందిన మీడియాలో ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
తనను గెలిపించిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోనని ఆయన తెలిపారు. ఏం చేసినా కూడా తాను తన నియోజకవర్గ ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానన్నారు. తనకు అన్ని పార్టీల్లో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలుంటారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాల వల్ల పార్టీ బలహీనపడిందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదన్నారు.సోనియాకు, రాహుల్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడబోనని చెప్పారు. సాధు జంతువు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపి పులిలాంటి బీజేపీని కేసీఆర్ కోరితెచ్చుకొంటున్నారన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో చెప్పినట్టుగా గుర్తు చేశారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి ఉందని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఇందుకు జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల పలితాలే నిదర్శనమన్నారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాలనుకుంటే మునుగోడులో ప్రజలు కోరుకొంటే ఉప ఎన్నిక వస్తుందన్నారు.పార్టీ మారాలనుకొంటే కాంగ్రెస్ కు రాజీనామా చేసి వెళ్తానని తెలిపారు. ఈ విషయమై సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి దండం పెట్టి చెబుతానన్నారు. మీ స్థానం నా గుండెల్లో ఉంటుందన్నారు. అయితే పార్టీ మారడం చారిత్రక అవసరమని ఆయన తేల్చి చెప్పారు.చారిత్రక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అలా చేయకపోతే చరిత్ర హీనులుగా మారిపోతామన్నారు.
also read:అమిత్ షాతో భేటీ వాస్తవమే: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
గత కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది. అయితే అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలవడంతో ఈ విషయమై మరోసారి ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను గద్దెదించే పార్టీలో చేరుతానని గతంలోనే ఆయన ప్రకటించారు. అయితే ఆ పార్టీ బీజేపీయా కాంగ్రెస్ అనే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే గతంలో కొన్ని సమయాల్లో ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు.ఈ విషయాన్ని ఇవాళ మీడయా సమావేశంలో కూడా రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.