మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంగతి బయటపెడతానని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంగతి బయటపెడతానని ఆయన హెచ్చరించారు.
మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీజీఓ నేతలు సత్యనారాయణ, మమత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంగతి బయటపెడతానని ఆయన చెప్పారు. మమత భర్తకు ఉద్యోగ విరమణ ఎలా పొడిగించారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం గౌడ సంఘానికి ఏం సంబంధమో చెప్పాల్సిందిగా కోరారు.
శ్రీనివాస్ గౌడ్ ఏదో ఒక రోజు కొంప ముంచుతారని స్వామిగౌడ్ కు తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ డూప్లికేట్ ఉద్యమకారుడు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమో కానీ, అప్పులతో పాటు కరోనా పెరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కేవలం హైద్రాబాద్, పాతబస్తీకే పరిమితమని భావించాం,. కానీ ఇప్పుడు జిల్లాలకు కూడ వ్యాపించిందని ఆయన చెప్పారు.
also read:టైమొచ్చినప్పుడు చరిత్ర బయటపెడతా: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జగ్గారెడ్డి సంచలనం
ఆరోగ్య శాఖ మాత్రమే ఈటల వద్ద ఉంది, పవర్ మొత్తం సీఎం వద్దే ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల కరోనా బులెటిన్ కే పరిమితమని ఆయన విమర్శించారు. హైకోర్టు అంటే కూడ ప్రభుత్వానికి లెక్క లేదన్నారు.