పొన్నెకల్లు సబ్ స్టేషన్ ముందు రేవంత్ రెడ్డి నిరసన: రైతులకు మద్దతుగా ఆందోళన

By narsimha lode  |  First Published Feb 10, 2023, 4:23 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పొన్నెకల్లు సబ్ స్టేషన్ ముందు  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బైఠాయించారు.  విద్యుత్ కోతలను నిరసిస్తూ  రైతులతో  కలిసి రేవంంత్ రెడ్డి  నిరసనకు దిగారు. 
 


ఖమ్మం:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని   పొన్నెకల్లు  విద్యుత్ సబ్ స్టేషన్ ముందు  శుక్రవారం నాడు టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఆందోళన నిర్వహించారు. విద్యుత్ సమస్యపై  సబ్ స్టేషన్ ముందు  ఆందోళనకు దిగిన రైతులతో కలిసి  రేవంత్ రెడ్డి బైఠాయించారు.

విద్యుత్  కోతలతో  పంటలు దెబ్బతినే పరిస్తితి నెలకొందని  రైతులు  రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు.  రైతులకు  24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం   రైతులకు  అవసరమైన సమయంలో  విద్యుత్  సరఫరా  చేయకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. 

Latest Videos

దేశంలో  రైతులకు  ఉచితంగా  విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని  బీఆర్ఎస్ నేతలు గర్వంగా చెేప్పుకుంటున్నారు. అయితే  విద్యుత్ కోతల కారణంగా  రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో  ఏ ప్రాంతంలో  రైతులకు  24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారో చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్   కేసీఆర్ సర్కార్  ప్రశ్నించారు. రైతులకు  24 గంటల పాటు విద్యుత్ ను సరపరా చేస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని  ప్రకటించిన విషయం తెలిసిందే.  

ఈ నెల  6వ తేదీన రేవంత్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర సాగుతున్న  ప్రాంతాల్లో  ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.  ప్రజల సమస్యల పరిష్కారం కోసం  తమ  పార్టీ ఏం చేయనుందో వివరిస్తున్నారు.   

మేడారం  వద్ద రేవంత్ రెడ్డి  పాదయాత్ర ప్రారంభించారు.  తొలివిడతలో  రేవంత్ రెడ్డి  50 అసెంబ్లీ  నియోజకవర్గాల్లో  పాదయాత్ర  నిర్వహించనున్నారు . 60 రోజుల పాటు రేవంత్ రెడ్డి   పాదయాత్ర  నిర్వహించనున్నారు. 

also read:భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ: కేటీఆర్ కు రేవంత్ కౌంటర్, ప్రగతి భవన్ పై ఇలా...

అసెంబ్లీ సమావేశాలు పూర్తైన  తర్వాత  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఈ నెల  13 నుండి పాదయాత్ర  చేస్తానని భువనగిరి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రకటించారు. 


 

click me!