నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీం: శంకుస్థాపన చేసిన కేసీఆర్

By narsimha lodeFirst Published Feb 10, 2021, 1:46 PM IST
Highlights

నల్గొండ జిల్లాలో నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు బుధవారం నాడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

నల్గొండ: నల్గొండ జిల్లాలో నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు బుధవారం నాడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ కు చేరుకొన్నారు. నాగార్జునసాగర్ కు సమీపంలోని నెల్లికల్లు వద్ద లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు సీఎం శంకుస్థాపన చేశారు.

ఇటీవల కాలంలోనే ఈ స్కీమ్ కు సీఎం నిధులు మంజూరు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లతో పాటు పలు కార్యక్రమాలకు సీఎం నిధులు మంజూరు చేశారు.త్వరలోనే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికను పురస్కరించుకొని లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి సీఎం నిధులు మంజూరు చేశారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఇవాళ హలియాలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభలో పాల్గొనడానికి  ముందుగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు  సీఎం శంకుస్థాపన చేశారు. హలియాలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్  నాగార్జునసాగర్ కు వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
 

click me!