
కాంగ్రెస్ గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ భర్త డికె భరతసింహారెడ్డికి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద భరతసింహారెడ్డి ప్రయాణిస్తున్న కారును మీరొక కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన భరత్ సింహారెడ్డిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఘటన తెలుసుకున్న డికె అరుణ హైదరాబాదు బయలు దేరారు.