రీ డిజైనింగ్ పేరుతో దోపిడీ

Published : Nov 07, 2016, 01:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
రీ డిజైనింగ్ పేరుతో దోపిడీ

సారాంశం

సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ధ్వజం మంచిర్యాలలో కాంగ్రెస్ యువగర్జన భారీగా హాజరైన విద్యార్థులు ఫీజు రి యింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాగు కోసం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే రీ డిజైన్ పేరుతో వాటిల్లో మార్పులు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం మంచిర్యాల జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ యువగర్జన సభలో ఆయన ప్రసంగించారు.  విద్యార్థులే రాష్ట్రాభివృద్ధికి కారకులని, పేద విద్యార్థులు అందరు చదువుకొని బాగుపడలని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీ యింబర్స్ మెంట్ పథకానికి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం

ఫీజు బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థలును ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం రాష్ట్రానిన దోచుకుంటుందన్నానరు. రాష్ట్రంలోని  ఏడు జిల్లాల్లో పంటపోలాలకు సాగునీరు అందేలా భారీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుతం ప్రాణహిత ప్రాజెక్టు కు రూపకల్పన చేస్తే ఆ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని దానిన కేసీఆర్ రద్దు చేశారని విమర్శించారు.
ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల రాష్ట్ర ప్రజలపై 1,800 కోట్లు అదనంగా భారం పడుతుందని తెలిపారు.  ఒక వైపు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే రక్షించాల్సిన గవర్నర్ ప్రభుత్వ పాలన బాగుందని ప్రశంసించడం దారుణమన్నారు. రుణ మాఫీ, ఫీజు రీ యింబర్స్ మెంట్ సరిగా అమలు కాక విద్యార్థులు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో గవర్నర్ తెలుసుకోవాలని సూచించారు.

PREV
click me!

Recommended Stories

Naa anveshana: పొగిడిన నోర్లే తిడుతున్నాయి.. అన్వేష్ మిస్ అయిన లాజిక్ ఏంటి.?
Railway Offer : సంక్రాంతికి ఊరెళ్లేందుకు టికెట్స్ కావాలా..? ఈ యాప్ ద్వారా కొంటే సూపర్ డిస్కౌంట్