తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలపుకు బీజేపీ సాయం.. మాణిక్‌రావు ఠాక్రే

By Sumanth Kanukula  |  First Published Nov 8, 2023, 11:41 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వహించడం బీఆర్ఎస్‌కు గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనే దానిని ప్రతిబింబిస్తుందని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం పార్టీలు ఒకటేనని.. వారు కలిసి పోరాడుతున్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని అన్నారు.

‘‘తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడలేదు. తద్వారా ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ఎన్నికల్లో పోరాడుతున్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రతి నిర్ణయం వెనక బీజేపీ ఉంది. బీఆర్‌ఎస్‌కు (ఎన్నికల్లో గెలవడానికి) సహాయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తద్వారా 2024లో వారికి బీఆర్‌ఎస్ నుంచి సహాయం అందుతుంది’’ మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. 

Latest Videos

undefined

ఇదిలాఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం రోజున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్‌కు సీ టీమ్ అని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల డీఎన్‌ఏ ఒకటేనని.. ఇరు పార్టీలలో రాజవంశ పాలన, అవినీతి, బుజ్జగింపు కామన్‌గా కనిపిస్తాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ఒకే నాణేనికి రెండు ముఖాలు అని కూడా మోదీ అన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్లు అన్నింటినీ తిరిగి ప్రజలకు అందించాల్సి ఉంటుందని మోదీ పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే మోదీ వ్యాఖ్యలపై మాణిక్‌రావ్ ఠాక్రే స్పందించారు. ఇక, తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 
 

click me!