ప్రధాని మోదీ బిసి ముఖ్యమంత్రి ప్రకటన... బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar P  |  First Published Nov 8, 2023, 10:56 AM IST

పేద వర్గాలకు చెందిన నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం పెడతామని ప్రకటించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చి అంతా బిజెపి వైపే చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. 


కరీంనగర్ : తెలంగాణ ప్రజలకు దొరల పాలన నుండి విముక్తి కల్పించాలని బిజెపి ప్రయత్నిస్తోంది... అందుకోసమే బిసి సీఎం ప్రకటన చేసినట్లు కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ బిసి ఆత్మగౌరవ సభలో కూడా బిసి ముఖ్యమంత్రి ప్రకటన చేసారని... తద్వారా పేద వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారన్నారు. తమలాగా బిసిలని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించె దమ్ము కేసిఆర్ కి‌ ఉందా? అని సవాల్ చేసారు. కాంగ్రెస్ పార్టీ కూడా పేద వర్గాలకు చెందిన నాయకుడిని సీఎం చేసే దమ్ముందా? అని బండి సంజయ్ ఛాలెంజ్ చేసారు. 

రాజకీయంగా పేద వర్గాలకు చెందిన నాయకులకే బిజెపి అవకాశం ఇచ్చింది... ఇప్పుడు అధికారమే వారి చేతిలో పెట్టడానికి సిద్దంగా వుందని అన్నారు. బిసి నాయకుడు ముఖ్యమంత్రి అయితే తమ సమస్యలు తెలుస్తాయని... పేదలకు మేలు జరుగుతుందని తెలంగాణ సమాజం నమ్ముతోందని అన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Latest Videos

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ వాతావరణ బిజెపికి అనుకూలంగా వుందని సంజయ్ అన్నారు. ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి ఓటర్ల మూడ్ ఏంటో అర్థమవుతోందని అన్నారు. కరీంనగర్ లో అయితే స్థానిక మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర వ్యతిరేకత వుందన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బిజెపి  రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కేంద్ర ప్రభుత్వ సాయంలో ప్రజాసేవ చేయడానికి ప్రయత్నిస్తోంది... కాబట్టి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు నిర్ణయానికి వచ్చినట్లు సంజయ్ వెల్లడించారు. 

వీడియో

కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదు... గతంలో గెలిపించివారంతా కేసీఆర్ పంచన చేరారని భావిస్తున్నారని సంజయ్ తెలిపారు. కేవలం డబ్బులతో గెలిచే కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోడానికి... కేసీఆర్ కొనుక్కోడానికి సిద్దంగా వుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసిఆర్ కు వేసినట్లేనని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఎంఐఎం మద్దతులో అధికారంలోకి రావాలని చూస్తున్నాయని అన్నారు. 

Read More  సీటు ఒకరికి... భీఫామ్ ఇంకొకరికి : బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు అధినేత కేసీఆర్ షాక్

బిఆర్ఎస్ గెలవకున్నా పర్వాలేదు కానీ కాంగ్రెస్ గెలవాలని కేసిఆర్ కొరుకుంటున్నారంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ  వ్యతిరేక ఓటును చీల్చడానికి కేసీఆర్ కాంగ్రెస్ ను పావుగా వాడుకుంటున్నాడని అన్నారు. కాబట్టి ఉపఎన్నికల్లో ఎలాగయితే  బిజెపికి విజయాన్నిఅందించారో ఇప్పుడు కూడా అలాగే మద్దతివ్వాలని ప్రజలను సంజయ్ కోరారు. 

కరీంనగర్ లో బిజెపికి బిఆర్ఎస్ కనీస ఫోటీ ఇవ్వలేదని... తన గెలుపు ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసారు. బిఆర్ఎస్ నాలుగో స్థానానికే పరిమితం అవుతుందని... ఎవరొచ్చి ప్రచారం చేసినా పరిస్థితి మారదన్నారు. కరీంనగర్ లో అన్ని వర్గాల ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తున్న గంగుల కమలాకర్ నుండి విముక్తి పొందాలంటే ఓడించడమే మార్గమని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలకుండా ఆలోచించి ఓటేయాలని బండి సంజయ్ సూచించారు. 

click me!