గంగుల కమలాకర్ కు హైకోర్టులో ఊరట: పొన్నం ప్రభాకర్ పిటిషన్ కొట్టివేత

By narsimha lode  |  First Published Nov 8, 2023, 11:01 AM IST

గత ఎన్నికల్లో గంగుల కమలాకర్ పై  కాంగ్రెస్ అభ్యర్ధి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. 



హైదరాబాద్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు  హైకోర్టులో  బుధవారంనాడు ఊరట లభించింది.  కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన  పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు  ఇవాళ కొట్టివేసింది.  ఎన్నికల సంఘం నిర్ధారించిన వ్యయం కంటే  ఎక్కువ ఖర్చు చేశారని గంగుల కమలాకర్ పై  పొన్నం ప్రభాకర్  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  ఇరు వర్గాల వాదనలను తెలంగాణ హైకోర్టు విన్నది. సరైన ఆధారాలు లేవని  పొన్నం ప్రభాకర్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా గంగుల కమలాకర్ బరిలో దిగారు.బీజేపీ అభ్యర్ధిగా  బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా  పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్  విజయం సాధించారు. అయితే  నిర్ధేశించిన ఎన్నికల వ్యయం కంటే  ఎక్కువ ఖర్చు చేశారని  గంగుల కమలాకర్ పై  పొన్నం ప్రభాకర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  విచారించింది.  పొన్నం ప్రభాకర్ పిటిషన్ ను కొట్టివేసింది.  

Latest Videos

ఇదిలా ఉంటే  గంగుల కమలాకర్ పై  బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడ  మరో పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో  ఈ ఏడాది ఆగస్టు మాసంలో  క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. గంగుల కమలాకర్ పై  బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై  రేపు విచారణ నిర్వహించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు  ఇవాళ వెల్లడించింది. 

click me!