సీఎల్పీ విలీనం: ధర్నాకు దిగిన భట్టి, శ్రీధర్ బాబు

By narsimha lodeFirst Published Jun 6, 2019, 2:36 PM IST
Highlights

సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టుగా ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు  స్పీకర్‌కు లేఖ ఇవ్వడంపై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు అసెంబ్లీ ఆవరణలో దీక్షకు దిగారు.


హైదరాబాద్: సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టుగా ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు  స్పీకర్‌కు లేఖ ఇవ్వడంపై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు అసెంబ్లీ ఆవరణలో దీక్షకు దిగారు.

గురువారం నాడు  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ విందుకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టుగా లేఖను ఇచ్చారు.

ఈ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేయాలని భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ప్రయత్నించారు. 

అయితే గాంధీ విగ్రహం ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకొన్నారు. దీంతో గాంధీ విగ్రహానికి సమీపంలోనే  శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క నిరసనకు దిగారు. ఆ తర్వాత ఈ నిరసనలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

సీఎల్పీ విలీనం: ధర్నాకు దిగిన భట్టి, శ్రీధర్ బాబు

టీఆర్ఎస్ లోకి గంపగుత్తగా 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు: స్పీకర్‌కు విలీనం లేఖ

12 మంది ఎమ్మెల్యేలకి కేటీఆర్ విందు: సీఎల్పీ విలీనానికి లేఖ

click me!