రేవంత్‌పై వ్యాఖ్యలు: భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి చిత్రపటం దగ్ధం

Siva Kodati |  
Published : Jul 12, 2021, 08:01 PM ISTUpdated : Jul 12, 2021, 08:02 PM IST
రేవంత్‌పై వ్యాఖ్యలు: భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి చిత్రపటం దగ్ధం

సారాంశం

రేవంత్‌పై బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హుజురాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌశిక్ రెడ్డి చిత్ర పటాన్ని దగ్థం చేసి.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యకర్తలు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిలో భాగంగా హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపాయి. మరోవైపు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2018లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం వల్లే కౌశిక్ లీడర్ అయ్యారని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డి తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికే కౌశిక్ ఆరోపణలు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు . ఆయన పీసీసీ అధ్యక్షుడిలాగా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఈటలకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పీసీసీ పదవిని ఎందుకు ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా మోసినోళ్లమంతా పిచ్చోళ్లమా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పొన్నం, రేవంత్ రెడ్డిలకు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. పొన్నంకి డిపాజిట్ వస్తుందేమో చూస్తానంటూ వ్యాఖ్యానించారు. 

Also Read:టీఆర్ఎస్ పెద్దల ప్రసన్నం కోసమే .. రేవంత్, ఠాగూర్‌లపై వ్యాఖ్యలు: కౌశిక్ రెడ్డిపై ఉత్తమ్ ఆగ్రహం

రేవంత్ రెడ్డి వల్ల ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు. పొన్నం, రేవంత్ రెడ్డిలు ఈటలకు కోవర్ట్‌లని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎలా అయ్యారో అందరికీ తెలుసునన్నారు. లుంగి కట్టుకుని ఢిల్లీ నుంచి వచ్చే మాణిక్ ఠాగూర్‌కి కొంచెం కూడా కామన్ సెన్స్ వుండదని, పెద్ద లీడర్‌ని అని చెప్పుకుంటారంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాణిక్ ఠాగూర్ పెద్ద యూజ్ లెస్ ఫాలో అని ధ్వజమెత్తారు. మాణిక్ ఠాగూర్‌కి రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?